Breaking News
Home / Lifestyle / Business / తన కస్టమర్ల కోసం…

తన కస్టమర్ల కోసం…

హైదరాబాద్, బిజినెస్‌ : హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యంతో వాల్‌మార్డ్‌ ఇండియా తన కస్టమర్ల కోసం కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను విడుదల చేసింది. వాల్‌మార్ట్‌ తాలూకు బెస్ట్‌ప్రైస్‌ హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్ల సభ్యుల కోసం ఈ కార్డులను విడుదల చేస్తున్నట్లు వాల్‌మార్ట్‌ ఇండియా సీఈఓ క్రిష్‌ అయ్యర్‌ చెప్పారు. వీటితో కస్టమర్లకు 18- 50 రోజుల ఫ్రీ క్రెడిట్‌ లభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా బెస్ట్‌ప్రైస్‌లో రిజిస్టరైన సభ్యులు ఈ కార్డులకు అర్హులని తెలియజేశారు.ఈ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్ల లాంటి పలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలుంటాయన్నారు. త్వరలో కర్నూలు, తిరుపతిల్లో బెస్ట్‌ప్రైస్‌ దుకాణాలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా క్రిష్‌ అయ్యర్‌ చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *