Breaking News
Home / States / Andhra Pradesh / బైక్ లేదా కారు కొనాలనుకుంటున్న వారికి బంపరాఫర్…

బైక్ లేదా కారు కొనాలనుకుంటున్న వారికి బంపరాఫర్…

దసరా ధమాకా
ఆఫర్లకు సిద్ధం అవుతున్న షోరూంలు, కంపెనీలు
దీపావళి వరకు కొనసాగింపు
రేపు మోగనున్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ నగరా
వినియోగదారులను ఆకర్షించేందుకు గిఫ్టులు
ధర తగ్గింపు ప్రకటనలు.. కొత్తగా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు
విజయదశమి విజయాలకు చిహ్నం.. ఆ రోజు ఏ పనిని ప్రారంభిస్తే అది విజయవంతంగా జరుగుతుందన్నది ఎక్కువమంది నమ్మకం. కొత్త పనే కాదు… కొత్త వస్తు వు కొన్నా ఆ రోజు అది శుభసూచికమేనని ఎక్కువ మంది నమ్మం. దీనిని పసికట్టిన కంపెనీలు గత కొన్నేళ్లుగా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి దసరాను సరైన సమయంగా ఎంచుకుంటున్నాయి. ప్రతి కంపెనీకి సంవత్సరం మొత్తం మీద జరిగే అమ్మకాలలో 40 శాతం అమ్మ కాలు ఒక్క దసరా సందర్భంగానే జరగడం ఇందుకు ఉదాహరణ.

గుంటూరు: ప్రతి పండుగకు షోరూంలు ఏవో ఒక ఆఫర్ల పేరుతో ప్రకటనలు ఇస్తూనే ఉంటాయి. కానీ దసరా ఆఫర్లు ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా దసరాకు ఎక్కువమంది ఇంట్లోకి గృహోపకరణం, ద్విచక్ర వాహనం, కార్లు వంటివి కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని గృహోపకరణాల, ద్విచక్ర, కార్ల షోరూంలు తమ వస్తువులను విక్రయించుకునేందుకు సిద్ధం అయ్యాయి. ఆఫర్ల మోత మోగిస్తున్నాయి. దీపావళి వరకు ఇది కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌ మార్కెట్‌లోనూ దసరా ఆఫర్ల జోరు పెరిగింది.

ఆన్‌లైన్‌లో ఆఫర్ల జోరు..
ఒకప్పుడు ఎలక్ర్టానిక్‌, ఎలక్ర్టిక్‌ వస్తువులు కొనుగోలు చేసేందుకు కూడా షోరూంల వద్ద ఆఫర్ల కోసం చూస్తుండేవారు. దీనినిదృష్టిలో ఉంచుకొని షోరూం నిర్వాహకులు కూడా గిఫ్ట్‌ ఓచర్లతో పాటు లాటరీలు, కార్లు బహుమతులు ఇ చ్చేందుకు కూడా పోటీ పడేవారు. అయి తే రెండేళ్లుగా ఈ కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు తమ ఆఫర్లతో విని యోగదారులను వారి వైపు చూ సేలా చేశా యి. ఈ ఏడాది కూడా నవరాత్రుల ప్రారంభం రోజున 29న ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు ఇప్పటికే ఈ కంపెనీలు తెలిపాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్‌లు, జిమ్‌ సామాన్లపై 62 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో అవసరమైన వారందరు దీని కోసమే ఎదురు చూస్తున్నారు. మిగిలిన ఎలక్ర్టిక్‌, ఎలక్ర్టానిక్స్‌ పరికరాలపై కూడా 30 నుంచి 40 శాతం వరకు గత ఏడాది ఇచ్చినం దు వలన ఈ ఏడాది కూడా ఇవ్వవచ్చని వినియోగదారులు చూస్తున్నారు.

ముఖ్యంగా టీవీని రూ.6 వేలకు వస్తున్నట్లు ప్రకటనలు రావడంతో అనేకమంది మధ్య తరగతి వారు కూడా వీటి కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు బ్యాంక్‌ కార్డులు వినియోగిస్తే 10 శాతం అదనపు రాయితీతో పాటు ఎటువంటి బ్యాంక్‌ కార్డులు లేకపోయినా రూ.లక్ష వరకు వాయిదాల పద్ధతిలో చెల్లించే సదుపాయం కూడా ఈ సంస్థలు ప్రవేశపెట్టాయి. దీంతో ఎలక్ర్టానిక్స్‌ మార్కెట్‌ను ఈ రెండు సంస్థలు 90 శాతం చేజిక్కించుకోనున్నాయి. దీని ప్రభావం కావచ్చు లేదా మరే ఇతర కారణాల వలన కాని ఇప్పటి వరకు ఎలక్ర్టానిక్స్‌ షోరూం మార్కెట్‌లలో ఆఫర్లు ప్రకటించడం లేదు.

ద్విచక్ర వాహన మార్కెట్‌లో..
దసరా సందర్భంగా జిల్లాలోని దాదాపు అన్ని ద్విచక్ర వాహన ఏజన్సీలు వివిధ ఆఫర్లను ప్రకటించాయి. సాధారణంగా కంపెనీలు, ఏజన్సీలు కలిసి ఈ ఆఫర్లను అందిస్తాయి. అయితే ఉత్తర భారతదేశంలో దీపావళికి ఎక్కువ అమ్మకాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉం చుకొని కంపెనీలు దీపావళికి ఆఫర్లు ఇస్తాయి. అందువలన ఏజన్సీలే ప్రస్తుతం ఆఫర్లను ప్రకటించాయి. హోండా షో రూంలలో రూ.5వేల గ్రైండర్‌తో పాటు 7వేల గిఫ్ట్‌ ఓచర్‌ను అందిస్తూ ఒక్క యూనికార్న్‌ తప్ప మిగిలిన వాటిపై రూ.12 వేల వరకు తగ్గింపును ప్రకటిస్తున్నాయి.

ఇవి కాక తక్కువ డౌన్‌పేమెంట్‌లు, తక్కువ వడ్డీ రేట్లను షోరూంను బట్టి ప్రకటించాయి. హీరో కంపెనీ షోరూంలు కూడా ఎక్కువగా గ్రైండర్‌ను గిఫ్ట్‌గా ప్రకటిస్తున్నాయి. బజాజ్‌ కంపెనీ తన అన్ని ఉత్పత్తులపై రూ.2వేల నుంచి రూ. 3,500 వరకు తగ్గింపు ధరలను అందిస్తుంది. అంతేకాకుండా అదనంగా రెండు సర్వీసింగ్‌లు, మూడు సంవత్సరాల వారంటిని కూడా కంపెనీయే నేరుగా అందించడంతో అన్ని బజాజ్‌ ఏజన్సీలలోనూ వీటిని అందుబాటులో ఉంచారు. ఇప్పటికే గత నాలుగు నెలలుగా వాహన విక్రయాలలో మందగమనం ఉండటంతో షోరూంల నిర్వాహకులు దసరాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆఫర్లు దీపావళి వరకు కొనసాగించనున్నట్లు పలువురు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *