Breaking News
Home / Lifestyle / Business / ఫోర్బ్స్‌ 2018 టాప్‌ 100 శ్రీమంతుల జాబితా

ఫోర్బ్స్‌ 2018 టాప్‌ 100 శ్రీమంతుల జాబితా

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో అత్యధికంగా ఆర్జించిన వంద మంది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్‌ ‘దబాంగ్‌’ ‌ సల్మాన్‌ ఖాన్‌ అగ్రస్థానం దక్కించుకున్నారు. 2018లో సల్మాన్‌ వార్షికాదాయం రూ.253.25 కోట్లు. ఆయన నటించిన ‘రేస్‌ 3’ చిత్రం కథపరంగా ప్రేక్షకులను నిరాశపరిచినా వసూళ్ల పరంగా మాత్రం బాగానే నిలదొక్కుకుంది. అదీకాకుండా సల్మాన్‌ ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. అదీకాకుండా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘దస్‌ కా దమ్‌’, ‘బిగ్‌బాస్‌’ షోలకు ఎక్కువగా పారితోషికాలు తీసుకోవడం వల్ల సల్మాన్‌ ఫోర్బ్స్‌ టాప్‌ 100 జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

ఆ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(రూ.228.09 కోట్లు) ఉన్నారు. బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె నాలుగో స్థానంలో ఉన్నారు. టాప్‌ 100 జాబితాలో తొలి ఐదు స్థానాల్లో చోటు సంపాదించిన ఏకైక మహిళా సెలబ్రిటీ దీపిక కావడం విశేషం. ఆమె నటించిన ‘పద్మావత్‌’ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ఎన్నో ప్రకటనలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న దీపిక తన మార్కెట్‌ విలువకు తగ్గట్టుగానే పారితోషికం తీసుకుంటున్నారు.

టాప్‌ 10 జాబితాలో ఎవరున్నారంటే:

* సల్మాన్‌ ఖాన్‌ (‌ రూ.253.25 కోట్లు)

* విరాట్‌ కోహ్లీ (రూ.228.09 కోట్లు)

* అక్షయ్‌ కుమార్‌ (రూ.185 కోట్లు)

* దీపిక పదుకొణె (రూ.112.8 కోట్లు)

* మహేంద్ర సింగ్‌ ధోనీ (రూ.101.77 కోట్లు)

* ఆమిర్‌ ఖాన్‌ (రూ.97.5 కోట్లు)

* అమితాబ్‌ బచ్చన్‌ (రూ.96.17 కోట్లు)

* రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.84.67 కోట్లు)

* సచిన్‌ తెందుల్కర్‌ (రూ.80 కోట్లు)

* అజయ్‌ దేవగణ్‌ (రూ. 74.5 కోట్లు)

టాప్‌ 100 జాబితాలో మన టాలీవుడ్‌ ప్రముఖులు కూడా స్థానం సంపాదించారు. వారి వివరాలు చూస్తే..

24) పవన్‌ కల్యాణ్‌ (రూ.31.33 కోట్లు)

28) ఎన్టీఆర్‌ (రూ.28 కోట్లు)

33) మహేశ్‌ బాబు (రూ.24.33 కోట్లు)

36) నాగార్జున (రూ.22.25 కోట్లు)

39) కొరటాల శివ (రూ.20 కోట్లు)

64) అల్లు అర్జున్‌ (రూ.15.67 కోట్లు)

72) రామ్‌చరణ్‌ (రూ.14 కోట్లు)

72) విజయ్‌ దేవరకొండ (రూ.14 కోట్లు)

Check Also

ఆయిల్‌ ఢమాల్‌ : రుపీ గెయిన్‌

Share this on WhatsAppముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత బలహీనపడ్డాయి. దీంతో దేశీయ కరెన్సీ ధర రూపాయి పుంజుకుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *