Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఉత్తరాంధ్ర, కోస్తాలకు భారీ వర్ష సూచన….

ఉత్తరాంధ్ర, కోస్తాలకు భారీ వర్ష సూచన….

అమరావతి: ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ రోజు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. వాగులు, వంకలు, నదుల్లో భారీగా వర్షపు నీరు వచ్చే అవకాశాలుండడంతో ప్రజలు వాటిని దాటకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *