జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలం రేచపల్లిలో అవినీతి నిరోదక శాఖ దాడులు నిర్వహించింది. దాడిలో రూ.6వేలు లంచం తీసుకుంటూ అటవీశాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు. అటవీశాఖ సెక్షన్ అధికారి పవన్, బీట్ అధికారి వసీంలను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
