ఫిల్మ్ న్యూస్: సీనియర్ నటి గీతాంజలి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపాన్ని తెలియజేశారు. “ఎన్టీఆర్ దర్శకత్వంలో ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో సీతగా నటించి ప్రేక్షక హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుని, ఆ తర్వాత హాస్యనటిగా రాణించిన నటీమణి గీతాంజలిగారి మరణం విచారకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ” చంద్రబాబు ట్వీట్ చేశారు.
