Breaking News
Home / National / మాజీ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు…

మాజీ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు…

బెంగళూరు: కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యడ్యూరప్పకి, ప్రధాని మోదీకి మధ్య విశ్వసనీయత లోపించిందని, వారిద్దరి మధ్య సత్సంబంధాలు లేవని బాంబు పేల్చారు. సొంతపార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ప్రధానిని కలుసుకోలేకపోతున్నారని యడ్యూరప్పను ఎద్దేవా చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరదలు వస్తే, ప్రధాని మోదీ స్పందించారని కుమారస్వామి గుర్తుచేశారు. అంతేకాకుండా ఆ విషయంలో అసెంబ్లీ సైతం చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్న విషయాన్ని సైతం ప్రస్తావించారు.

యడ్యూరప్ప ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం నిధులను విడుదల చేసినా, చేయకపోయినా రాష్ట్రంలో ఉన్న నిధులను సమకూర్చి ప్రజల అవసరాలు తీర్చాలని కుమారస్వామి సూచించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *