Breaking News
Home / Uncategorized / మాజీ క్రికెటర్‌ సలీమ్‌ కన్నుమూత

మాజీ క్రికెటర్‌ సలీమ్‌ కన్నుమూత

హైదరాబాద్‌: మాజీ రంజీ క్రికెటర్‌ సుల్తాన్‌ సలీమ్‌ కన్ను మూశారు. 1962-1975 మధ్య కాలంలో ఆయన హైదరాబాద్‌తో పాటు ఆంధ్ర జట్టు తరఫున కూడా రంజీ ట్రోఫీ ఆడారు. 44 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో 20.43 సగటుతో సలీమ్‌ 1124 పరుగులు చేశారు. ఇందులో 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఆల్‌ సెయింట్స్‌ తరఫున స్కూల్‌ క్రికెట్‌ ఆడిన సమయంలో ఒకే మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లలో 201, 312 పరుగులు చేసిన ఘనతను సలీమ్‌ సొంతం చేసుకున్నారు. సుల్తాన్‌ సలీమ్‌ మృతి పట్ల హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

Check Also

హుజూర్ నగర్ ఉప ఎన్నిక బీజేపీకి పెద్ద పరీక్షే………

Share this on WhatsAppహుజూర్ నగర్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సమయం దగ్గర పడడంతో చాలా బాగా టెన్సన్స్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *