విజయవాడ : గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ప్రముఖ పాత్రికేయుడు, విశాలాంధ్ర దినపత్రిక మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మరికాసేపట్లో ఆయన భౌతికకాయాన్ని మగ్దూం భవన్కు తరలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడ విశాలాంధ్ర కార్యాలయానికి తరలిస్తారు.
