Breaking News
Home / National / ఢిల్లీలో హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ ఆందోళన…

ఢిల్లీలో హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ ఆందోళన…

న్యూఢిల్లీ: హర్యానా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో టికెట్ల కేటాయింపుపై గందరగోళం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నవారిని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్లు కేటాయించడంపై హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట తన అనుచరులతో కలిసి నిరసనకు దిగారు. ఐదేళ్లుగా చెమటోడ్చి పార్టీని బలోపేతం చేస్తూ మేమంతా పార్టీకే అంకితమయ్యాము. మమ్మల్ని కాదని కొత్తగా పార్టీలో చేరినవారికి టికెట్లు ఎందుకు ఇస్తారని అధిష్టానాన్ని అశోక్ తన్వర్ ప్రశ్నించారు. సోహ్న అసెంబ్లీ స్థానం రూ.5 కోట్లకు అమ్ముడుపోయింది. టికెట్ల కేటాయింపు న్యాయబద్దంగా లేకపోతే ఎంపిక చేయబడ్డ అభ్యర్థులు ఎలా గెలుస్తారని అశోక్ తన్వర్ ప్రశ్నించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *