మైసూరు: మైసూరులో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తే దేశంలో రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు. దళితులు, అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, అసమానతల వల్ల అవకాశాలు కోల్పోయిన వారికి ఆయన అండగా నిలబడ్డారన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించిన అంబేద్కర్ అంటే కొంతమందికి నచ్చదని తీవ్ర ఆరోపణలు చేశారు. 2018లోనూ ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒకవేళ భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ మార్పులకు సిద్ధపడితే దేశం రక్తసిక్తమవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
