Breaking News
Home / States / మహిళ సంకల్ప దీక్ష చేయనున్న మాజీ మంత్రి…

మహిళ సంకల్ప దీక్ష చేయనున్న మాజీ మంత్రి…

హైదరాబాద్: మద్యపానాన్ని నిషేధించాలంటూ మాజీ మంత్రి డీకే అరుణ దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11, 12వ తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల పాటు ‘మహిళ సంకల్ప దీక్ష’ చేయనున్నారు. మద్యం కారణంగానే మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దిశ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించకపోవటం బాధాకరమన్నారు.

దిశ ఘటనపై పార్లమెంట్‌లో చర్చ జరిగినా.. సీఎంకు చీమ కుట్టినట్టు కూడా లేదని డీకే అరుణ విమర్శించారు. దిశ కుటుంబాన్ని కనీసం ఫోన్‌లో కూడా పరామర్శించే సమయం కూడా సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారన్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసిన పబ్‌లు దర్శనమిస్తున్నాయన్నారు. డ్రగ్స్‌కు అడ్డాగా హైదరాబాద్  మారిందని డీకే అరుణ విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *