అమరావతి: వివేకా హత్య కేసులో వర్ల రామయ్యకు నోటీసులు ఇవ్వడం దారుణమని మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు. వివేకా హత్యపై విజయసాయి స్పందిస్తే ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. బోటు ప్రమాదంపై మాట్లాడినందుకే… హర్షకుమార్‌ను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. మీసాలు తిప్పడం పోలీసులకు ఫ్యాషన్‌గా మారిందా? అని ప్రశ్నించారు. దళితుల పట్ల ప్రభుత్వ తీరు మారకుంటే ఉద్యమిస్తామని జవహర్ హెచ్చరించారు.
