Breaking News
Home / States / Andhra Pradesh / మాజీ మంత్రి, టీడీపీ నేత అరెస్ట్….

మాజీ మంత్రి, టీడీపీ నేత అరెస్ట్….

మచిలీపట్నం: ఇసుక కృత్రిమ కొరతకు నిరసనగా మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర తలపెట్టిన 36 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తొలుత ఆయనను గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా అప్పటికే రవీంద్ర వేరే మార్గంలో కోనేరు సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ బలవంతంగా ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పోలీసులు తీరును తప్పుబట్టారు. శాంతియుతంగా ఆందోళన చేసే వారిని అరెస్టు చేయడం సబబు కాదని, ఇసుక కొరత కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *