Breaking News
Home / States / Andhra Pradesh / చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే….

చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే….

విజయనగరం : విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఆమె రాజధాని వెళ్లారు. టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ కు వెళ్లేముందు ఆమెతో చంద్రబాబు మాట్లాడారు. విజయనగరంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు ఆమెకు సూచించారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీలో అంతర్గత సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని చంద్రబాబు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *