హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో మల్కాజిగిరిలోని తన నివాసంలో కన్నుమూశారు. టీఎన్జీవో అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. 1969 ఉద్యమ సమయంలో సర్వీస్ నుంచి ఆమోస్ డిస్మిస్ అయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్సీగా పనిచేశారు.
