Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ అరెస్ట్…

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ అరెస్ట్…

ఈఎస్ఐ మెడికల్ స్కాం వివాదంతో ఏపీ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ సంచలనం సృష్టించింది.. ఈ ఎస్ ఐ మెడికల్ స్కాంలో ఆయనను అరెస్ట్ చేసారు.. కాగా ఇవాళ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు ఈ ఉదయం అరెస్టు చేశారు. శంషాబాద్‌లో ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరినీ హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. నకిలీ పత్రాలతో ప్రభాకర్‌రెడ్డి బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించారని ఏపీ ఆర్టీఏ అధికారులు ఆరోపిస్తున్నారు. 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *