Breaking News
Home / States / ఈఎస్‌ఐ స్కాంలో కస్టడీకి మరో నలుగురు…

ఈఎస్‌ఐ స్కాంలో కస్టడీకి మరో నలుగురు…

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ మందుల కుంభకోణం కేసులో మరో నలుగురిని అవినీతి నిరోధకశాఖ (అనిశా) అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఈఎస్‌ఐ ఆర్సీపురం ఆస్పత్రి సీనియర్‌ అసిస్టెంట్‌ సురేంద్రబాబు, నాచారం ఆస్పత్రి ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మి, లైఫ్‌కేర్‌ ఎండీ సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర హెల్త్‌కేర్‌ ఎండీ అరవింద్‌రెడ్డిలను తమ అదుపులోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఈ నలుగురినీ బంజారాహిల్స్‌ అనిశా ప్రధాన కార్యాలయానికి తరలించి రెండ్రోజుల పాటు విచారించనున్నారు.

ఇప్పటికే ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణితో పాటు మరో ఆరుగురిని ఏసీబీ కస్టడీలోకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. కస్టడీకి తీసుకున్న వారిలో దేవికారాణి సహా పద్మజ, వసంత ఇందిరా, రాధిక, ఫార్మా కంపెనీ ప్రతినిధులు శ్రీహరి, నాగరాజు, హర్షవర్ధన్‌ ఉన్నారు. దేవికారాణితో పాటు నిందితులను విడివిడిగా ప్రశ్నించి, వారి నుంచి వాంగ్మూలాలను సేకరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *