ప్యారిస్: ప్యారిస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇవాళ తాను పనిచేస్తున్న చోటే రక్తపాతం సృష్టించాడు. నలుగురు సహోదోగ్యులనలుగురిని పొడిచి కత్తితో పోలీస్ స్టేషన్లోకి.. కాల్చిచంపిన పోలీసులు..ను కత్తితో పొడిచి చంపాడు. అదే కత్తితో పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో.. ఫ్రాన్స్ పోలీసులు అతడిని కాల్చిచంపారు. ప్యారిస్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద జరిగిన ఈ ఘటనలో నిందితుడు సిరామిక్ కత్తిని ఉపయోగించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా నిందితుడు దాడి చేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దాడి నేపథ్యంలో ప్యారిస్ మెట్రో స్టేషన్ ‘సైట్’ను పోలీసులు మూసివేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా దళాలు హుటాహుటిన చుట్టుపక్కల పరిసరాల్లో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. కాగా ఈ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పురాతన క్యాథలిక్ చర్చి నోట్రెడేమ్కు పక్క వీధిలోనే ఉండడం గమనార్హం.