సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై ఇప్పటి వరకూ మొత్తం నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి రౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్‌కు కారు జోరు పెరిగిపోతోంది. టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఎన్నికల ప్రచారంలో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ అదే పోటీ కౌంటింగ్‌లో ఎక్కడా కనపడలేదు. ఈ ఫలితంపై తెలంగాణతో పాటు ఏపీ ప్రజల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. రౌండ్ల వారీగా ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.
మొదటి రౌండ్:-
టీఆర్ఎస్ : 5583
కాంగ్రెస్ : 3107
టీడీపీ : 113
బీజేపీ : 128
రెండో రౌండ్:-
టీఆర్ఎస్ : 10306
కాంగ్రెస్ : 5958
టీడీపీ : 182
బీజేపీ : 298
ఇదిలా ఉంటే మూడో రౌండ్ పూర్తయ్యే సరికి 6,777 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి సైదిరెడ్డి 9,356 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అయితే టీడీపీ, బీజేపీ అభ్యర్థులు వందల ఓట్లతో ఉన్నారు.