Breaking News
Home / States / ఉద్యోగం పేరిట మోసం…

ఉద్యోగం పేరిట మోసం…

మల్కాజ్ గిరి‌: రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసగించిన వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సికింద్రాబాద్‌ రైల్వే సంచాలన్‌ భవన్‌లో ఉద్యోగం చేస్తున్న డి.దయానంద్‌(50) చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా మల్లికార్జున నగర్‌లో నివాసం ఉంటున్న సంతోష్‌ కుమార్‌కు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని..రూ.3లక్షలకు మాట్లాడుకున్నాడు. రూ.1.15లక్షలు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *