Breaking News
Home / States / Andhra Pradesh / ఉద్యోగాల పేరుతో మోసం ….

ఉద్యోగాల పేరుతో మోసం ….

విజయవాడ: సీఆర్డీఏలో ఉద్యోగాలంటూ పలువురిని మోసగించిన ఓ ఘరానా మోసగాడి బండారం బట్టబయలైంది. సీఆర్డీఏ పేరుతో ఓ యువకుడు నకిలీ వెబ్‌సైట్ తెరిచి.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేశాడు. ఉద్యోగాలకు అప్లై చేసుకున్నవారికి ఫేక్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. నిరుద్యోగులకు అనుమానం వచ్చి సీఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వెబ్‌సైట్ నకిలీదిగా తేల్చారు. నిందితుడు ప్రకాశం జిల్లా వాసిగా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *