Breaking News
Home / States / జర్నలిస్ట్స్ కుటుంబాలకు ఉచిత ఆరోగ్య శిబిరం

జర్నలిస్ట్స్ కుటుంబాలకు ఉచిత ఆరోగ్య శిబిరం

హైదరాబాద్ : తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీయూడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఉర్దూ పాత్రికేయుల కుటుంబాలకు ఉచిత ఆరోగ్య శిబిరం జరగనుంది. మీనా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రితో కలిసి టీయూడబ్ల్యూజే ఈ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ నెల 12 న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు టీయూడబ్ల్యూజేఎఫ్ హైదరాబాద్ యూనిట్ కన్వీనర్ మహమ్మద్  వెల్లడించారు. హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉన్న మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఈ శిబిరం జరగనుంది. జనరల్ ఫిజిషియన్‌తో కన్సల్టేషన్, కంటి పరీక్షలు, కళ్ళజోళ్ళ పంపిణీ, గుండె పరీక్షలు, లాబ్ ఇన్వెస్టిగేషన్స్ సేవలను ఈ శిబిరంలో అందించనున్నారు. రిజిస్ట్రేషన్‌ల కోసం కన్వీనర్(92465 30266) / కో కన్వీనర్‌(99859 37610)లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *