Breaking News
Home / States / Andhra Pradesh / మిత్రుడి కోసం జోలె పట్టిన సహమిత్రులు….

మిత్రుడి కోసం జోలె పట్టిన సహమిత్రులు….

నెల్లూరు: సోమశిలలోని అనంతసాగరానికి చెందిన అల్లీ ఇమామ్‌షా, కాలేబీలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు షేక్‌ ఖాజావళి కుటుంబ ఆర్ధిక పరిస్థితి సరిగాలేక 10తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. సెంట్రింగ్‌ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్న అతడికి ఏడాది క్రితం హసీనాతో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతుండగా ప్రాణాంతకమైన బోన్‌ మ్యారో వ్యాధి సోకింది. వైద్యులను సంప్రదించగా వైద్యానికి రూ.25లక్షలకుపైగా ఖర్చవుతుందని తెలిపారు. దీనితో కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ప్రస్తుతం ఖాజావళి తమిళనాడులోని వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్సకు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. దాతలు స్పందించి సాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

తమతో పాటు తిరిగే స్నేహితుడు ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడడం స్నేహితులను కలచివేసింది. స్నేహితుడి ప్రాణాలను కాపాడుకునేందుకు వారంతా ఒక్కటై జోలె పట్టి రెండ్రోజులుగా గ్రామంలో ఇంటింటికి తిరిగి సాయం అందించాలని వేడుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా దాతల సాయం కోసం ఆర్ధిస్తున్నారు. ఎవరైనా సాయం చేయాలనుకునే దాతలు షేక్‌ జావీద్‌ 77994 47137, నియాజ్‌ 9676 517112 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *