విజయవాడ: నవ్యాంధ్రలో సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించేందుకు, సినీ పరిశ్రమకు చెందిన వారికి ఆంధ్రప్రదేశ్లోని సినీ అభిమానులకు అనుసంధానకర్తగా వ్యవహరించేందుకు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎఫ్టీపీసీ)ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలను ఏపీలో నిర్వ హించేందుకు అనువైన సంస్థలు లేని కొరతను తీర్చేందుకు ఎఫ్టీపీసీని ఏర్పాటు చేసినట్టు సంస్థ అధ్యక్షుడు జంగా చైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్టీపీసీ కార్యదర్శిగా పీవీఎస్ వర్మ ఉంటారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు చెందిన ఆడియో వేడుకలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, విజయోత్సవాలను తమ సంస్థ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తామని చైతన్య తెలిపారు.
