Breaking News
Home / Film News / ఆదివారం గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు

ఆదివారం గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు

ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈయన మృతికి సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే..ఆయన అంత్యక్రియలు చెన్నైలో ఆదివారం మధ్యాహ్నం జరుగుతాయని కుటుంబసభ్యులు వెల్లడించారు.

కుటుంబీకులు, బంధువులు విదేశాల్లో ఉంటున్నారు. వీరు వచ్చేంత వరకు ఆస్పత్రిలోనే మృతదేహాన్ని ఉంచనున్నట్లు గొల్లపూడి కుమారుడు మీడియాకు వెల్లడించారు. సినీ ప్రముఖులు, అభిమానులు భౌతికకాయాన్ని సందర్శించేందుకు శనివారం సాయంత్రం నుంచి అనుమతినిస్తామని తెలిపారు. అనంతరం గొల్లపూడి భౌతికకాయాన్ని నివాసానికి తరలిస్తామన్నారు.

చిరంజీవి కథానాయకుడిగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో.. నటుడిగా సినీ రంగప్రవేశం చేశారు గొల్లపూడి. ఆ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు. చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్‌ పేరున నాటక బృందాన్ని నడిపారు గొల్లపూడి. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్, వాపస్, మహానుభావాలు, నాటకాలకి నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు.. ప్రధాన పాత్రధారిగా కూడా నటించారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *