Breaking News
Home / States / ఆ ప్రణాళిక సీఎంకు మానస పుత్రిక…

ఆ ప్రణాళిక సీఎంకు మానస పుత్రిక…

ఖమ్మం: ఏన్కూరు మండలం బీఎన్ తండాలో జరిగిన గ్రామ సభకు మంత్రి పువ్వాడ అజయ్ హాజరైన సందర్భంగా మాట్లాడుతూ గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టారని కొనియాడారు. పరిశుభ్రత ఉంటే అనారోగ్యం బారిన పడే అవస్థ ఉండదన్నారు. 30 రోజుల ప్రణాళిక చాలా మంచి కార్యక్రమమని, ఈ 30 రోజుల ప్రణాళిక ముఖ్యమంత్రికి మానస పుత్రిక వంటిదని అన్నారు. గ్రామ పంచాయితీల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠ దానాలకు స్థలాలు సేకరించామని, గ్రామాల్లో వీధి లైట్లు ఏర్పాటు, హరితహారంలో మొక్కలు నాటినట్లు వెల్లడించారు. గ్రామాల రూపు రేఖలు మారుస్తామని చెప్తూ గ్రామ పంచాయితీ కార్యదర్శులు, యువతి, యువకులు ఉత్సాహంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *