కాన్పూర్ ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు వికాస్ దుబే మృతి చెందాడు. ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉజ్జయిని నుంచి రోడ్డు మీదుగా కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా కాన్వాయిలోని ఒక వాహనం బోల్తా పడింది. ఆ సమయంలో అతడు ఒక పోలీసు అధికారి నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులు జరుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని పోలీసు అధికారి మీడియాతో చెప్పారు. ఆ కాల్పుల్లో వికాస్ దుబే చనిపోయారని తెలిపారు.
