Breaking News
Home / Sports / త్వరలోనే కోహ్లీతో భేటీ కానున్న బీసీసీఐ చీఫ్ గంగూలీ

త్వరలోనే కోహ్లీతో భేటీ కానున్న బీసీసీఐ చీఫ్ గంగూలీ

ముంబై: బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ త్వరలోనే భేటీ కానున్నారు. బీసీసీఐ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గంగూలీ బుధవారం బాధ్యతలు చేపట్టాడు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఐసీసీ ట్రోఫీలు కూడా గెలవాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. కోహ్లీ పనులను మరింత సులభతరం చేయడానికి ప్రయత్నిస్తానని గంగూలీ పేర్కొన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

తాజాగా, గురువారం కోహ్లీ మాట్లాడుతూ.. గంగూలీతో సమావేశం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. భారత జట్టును మరింత అత్యున్నతస్థాయికి తీసుకెళ్లే విషయంపై మాట్లాడతామన్నాడు. గంగూలీతో గతంలో చాలాసార్లు మాట్లాడానన్న కోహ్లీ.. ఇప్పుడు మళ్లీ ఆయనతో భేటీ కానున్నట్టు తెలిపాడు. ఓ క్రికెటర్‌గా గంగూలీకి తమ పరిస్థితులేమిటో తెలుసన్నాడు. వృత్తిపరమైన అత్యున్నత చర్చలు అవసరమని కోహ్లీ పేర్కొన్నాడు. తాను ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్నానని, గంగూలీ గతంలో ఆడాడు కాబట్టి తమ మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *