Breaking News
Home / National / గంగూలీకి తొలి విజయం.. తొలి డే అండ్ నైట్ టెస్ట్‌కి రంగం సిద్ధం

గంగూలీకి తొలి విజయం.. తొలి డే అండ్ నైట్ టెస్ట్‌కి రంగం సిద్ధం

ముంబై: బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తొలి విజయం సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో సృజనాత్మక మార్పులు తీసుకొస్తానని గంగూలీ తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పేర్కొన్నారు. బీసీసీఐ కొత్త టీమ్ ఆధ్వర్యంలో టీం ఇండియా చరిత్రలోనే తొలిసారిగా డే అండ్ నైట్ టెస్ట్ ఆడనుంది. వచ్చే నెల 3వ తేదీ నుంచి బంగ్లాదేశ్, భారత్‌లో పర్యటించనుంది. అయితే ఈ పర్యటనలో భాగంగా ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌ని డే అండ్ నైట్‌గా నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి.. బీసీబీకి లేఖ రాసింది.

దీనిపై సోమవారం చర్చ జరిపిన బీసీబీ ఇందుకు అంగీకరిస్తున్నట్లు బీసీసీఐకి సమాచారం పంపించింది. దీనిపై గంగూలీ స్పందిస్తూ.. తన ఎజెండాలో అత్యంత ముఖ్యమైనది నెరవేరిందని అన్నారు. ‘‘ఇది చాలా మంచి పరిణామం. టెస్ట్ క్రికెట్‌కి మరింత ప్రోత్సాహం కావాలి. నేను, నా టీమ్ దీనిపై దృష్టిసారిచాము. విరాట్ కోహ్లీ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నాడు’’ అని అన్నారు.

కాగా, తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య 2015లో జరిగింది. ఇది జరిగిన నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం టెస్టుల్లో నెం.1 జట్టుగా ఉన్న భారత్ ఫ్లెడ్ లైట్ల మధ్య ఐదు రోజుల మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ డే అండ్ నైట్ టెస్ట్ ప్రతీ ఏడాది జరిగితే బాగుంటుందని గంగూలీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ప్రతీ ఏడాది పింక్ టెస్ట్‌ని నిర్వహిస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు జేన్ మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ఈ టెస్ట్‌ని నిర్వహిస్తుంది. అదే విధంగా ఈడెన్ టెస్ట్‌ కూడా ప్రతీ ఏడాది జరగాలని తాను కోరుకుంటున్నట్లు గంగూలీ పేర్కొన్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒలింపిక్స్‌లో ఘనతలు సాధించిన మన దేశ అథ్లెట్లను సత్కరించాలని భావిస్తున్నట్లు గంగూలీ తెలిపారు. ‘‘మేరీ కోమ్, పీవీ సింధు తదితర ఒలింపిక్ హీరోలను సత్కరించాలని భావిస్తున్నాము. మేము బీసీబీ సమాచారం కోసం ఎదురుచూశాము. ఈ ఆటను వీక్షించేందుకు స్కూల్ పిల్లలకు ఉచితంగా పాస్‌లు అందించాలని అనుకుంటున్నాము’’ అని ఆయన అన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *