మేడ్చల్ జిల్లా: ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక మహిళతో పాటు చిన్నారికి గాయాలయ్యాయి. మేడ్చల్ మండలం రాజాబొల్లారం తండాలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి.. మంటలు ఎగిసి పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు చిన్నారికి గాయాలయ్యాయి.
