చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎన్టీఆర్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
