ఫిల్మ్ న్యూస్: సత్యం సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నటి జెనీలియా. బొమ్మరిల్లుతో ‘అంతేనా.. కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే నాలుగు మాటలు’ అంటూ అచ్చ తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అయితే బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్తో వివాహం తర్వాత సినిమాలకు దూరమైపోయారు. పిల్లలు, భర్త, అత్త అంటూ కుటుంబానికే పరిమితమైపోయారు. ఈ మధ్య నగరానికి వచ్చిన ఆమెను ప్రముఖ మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నానని సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయని తెలిపింది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్లో కెరీరే తన లైఫ్ అనుకున్నానని ఇప్పుడు తన పిల్లలకు 300% ఇవ్వాలనుకుంటున్నానని చెప్పింది. ప్రస్తుతం మాతృత్వాన్నీ ఆస్వాదిస్తున్నానని తెలిపిన ఆమె ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తానని, సినిమాల్లో నటించడం తనకు సంతోషమేనంది.
టాలీవుడ్ హీరోల గురించి చెబుతూ ”ప్రభాస్.. ఎమేజింగ్ స్టార్. ‘బాహుబలి’! అతడు నాకు తెలిసినందుకు గర్వపడుతున్నాను. నాగార్జున.. మై గాడ్! ఆయనకు ఎప్పటికీ వయసు అయిపోదు ఎవర్ యంగ్ అనిపిస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్.. రియల్లీ స్వీట్; ఇక అల్లు అర్జున్ ఫుల్ మస్తీగా ఉంటాడు. అతడి ఎనర్జీ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది” అని చెప్పింది.