Breaking News
Home / World News / మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి జనరల్ పర్వేజ్ ముషార్రఫ్?

మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి జనరల్ పర్వేజ్ ముషార్రఫ్?

ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ తిరిగి రాజకీయాల్లో క్రియాశీలం కావాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన ఏడాది కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగవడంతో అక్టోబర్ 6 నుంచి మళ్లీ రాజకీయ రంగప్రవేశం చేయాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం.

అత్యంత ప్రమాదకరమైన, అరుదైన ‘అమిలాయ్‌డొసిస్’ అనే వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. అమిలాయిడ్ అనే ప్రొటీన్ శరీర భాగాల్లో చేరడం వల్ల ఆయనకు ఈ అనారోగ్యం కలిగింది. దీనికి గాను లండన్‌లో 12 రోజుల పాటు చికిత్స చేయించుకున్నారని పార్టీ ప్రధానకార్యదర్శి మెహ్రీన్ మాలిక్ తెలిపారు.

ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నారని, ఆసుపత్రి నుంచి దుబాయ్‌లోని తన ఇంటికి చేరుకున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా దుబాయ్‌లోని తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో ఓ సమావేశాన్ని కూడా నిర్వహించినట్లు మెహ్రీన్ వెల్లడించారు. మరోవైపు 2007 లో రాజ్యాంగాన్ని రద్దు చేయడంతో ముషార్రఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది.

దీంతో ఆయన 2016 నుంచి దుబాయ్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. పాక్‌లోని ఇమ్రాన్ సర్కార్‌పై సైన్యం తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయని తీవ్రంగా ప్రచారం జరగడం…. పాక్‌లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడం లాంటి ప్రతికూల పరిస్థితుల్లో మాజీ ప్రధాని ముషార్రఫ్ రాజకీయ రంగప్రవేశం అత్యంత ఆసక్తికరంగా మారింది.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *