Breaking News
Home / National / దర్బార్‌ తరలింపుపై ప్రధాన కార్యదర్శి సమీక్ష….

దర్బార్‌ తరలింపుపై ప్రధాన కార్యదర్శి సమీక్ష….

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో దర్బార్‌ తరలింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బివిఆర్‌ సుబ్రహ్మణ్యం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధానిని ప్రతియేటా ఆరు నెలలు శ్రీనగర్‌లోనూ, ఆరు నెలలు జమ్మూలోనూ నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం శ్రీనగర్‌ రాజధానిగా ప్రభుత్వం పని చేస్తున్నది. ఈ నెల 25, 26 తేదీలలో శ్రీనగర్‌లో కార్యాలయాలను మూసివేస్తారు. తిరిగి నవంబర్‌ 4న జమ్మూలో ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభిస్తారు. జమ్మూలోని అత్యధిక వేడిమిని, శ్రీనగర్‌లోని అత్యధికి చలిని తట్టుకుని పని చేయడానికి అనువుగా దర్బార్‌ తరలింపు విధానాన్ని 1872లో మహారాజా గులాబ్‌ సింగ్‌ ప్రారంభించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *