Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / దర్యాప్తు పేరుతో బస్సు సీజ్….

దర్యాప్తు పేరుతో బస్సు సీజ్….

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై బస్సు దాడి విషయమై హోంశాఖ ముఖ్య కార్యదర్శికి టీడీపీ నేత కళా వెంకట్రావు లేఖ రాశారు. రాజధాని పర్యటనకు చంద్రబాబు ఉపయోగించిన బస్సును దర్యాప్తు పేరుతో పోలీసులు సీజ్ చేసి దాని యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. పోలీసులు ప్రతిపక్షనేతపై దాడి చేసిన వారిని వదిలేసి దర్యాప్తు పేరుతో బస్సును సీజ్ చేయటం ఏంటని ప్రశ్నించారు. తొమ్మిది రోజులపాటు బస్సును పోలీసులు స్వాధీనంలోనే ఉంచుకుని యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని కళా వెంకట్రావు పేర్కొన్నారు. పోలీసులు బస్సును వెంటనే విడుదల చేయాలని… పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలన్నారు. ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని కళా వెంకట్రావు లేఖలో పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *