Breaking News
Home / National / కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోండి…

కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోండి…

ఢిల్లీ: ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ భవన్ ముందు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్, ఏఐటీయూసీ నేతలు ధర్నాకు దిగారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన యూనియన్ నాయకులను విడుదల చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీని వాడుకొని.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. లేకుంటే టీఎస్ఆర్టీసీకి మద్దతుగా దేశంలోని అన్ని ట్రేడ్ యూనియన్లు ధర్నాకు దిగుతాయని హెచ్చరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *