Breaking News
Home / Health / డిప్రెషన్‌ నుంచి బయటపడాలంటే…

డిప్రెషన్‌ నుంచి బయటపడాలంటే…

మెల్‌బోర్న్‌ : ఆరోగ్యకరమైన ఆహారంతో కేవలం నెలరోజుల వ్యవధిలోనే డిప్రెషన్ నుంచి బయటపడవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. నిత్యం చక్కెర, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకునే 76 మంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. యూనివర్సిటీ విద్యార్ధులపై పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఆరోగ్యకరమైన ఆహారంతో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని వెల్లడైంది. డిప్రెషన్ కు లోనైన వర్సిటీ విద్యార్ధులకు అధికంగా పండ్లు, కూరగాయలు, చేపలు వంటి ఆహారాన్ని అందించగా కేవలం మూడు వారాల్లోనే వారి ప్రవర్తనలో గణనీయమైన మెరుగుదల కనిపించినట్టు పరిశోధకులు గుర్తించారు.

విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగిన ఆహారంతో మెదడు ఆరోగ్యం కుదుట పడుతుందని వారు పేర్కొన్నారు. ఆస్ర్టేలియాకు చెందిన మాక్వురి యూనివర్సిటీ చేపట్టిన ఈ పరిశోధనలో మంచి ఆహారంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడతుందని వెల్లడైంది. డిప్రెషన్‌కు చికిత్స అందించే విషయంలో తమ పరిశోధనల వివరాలు వినూత్న మార్పులకు దారితీస్తాయని అధ్యయన రచయిత డాక్టర్‌ హీథర్‌ ఫ్రాన్సిస్‌ పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *