Breaking News
Home / States / జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణపై కీలక నిర్ణయం…

జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణపై కీలక నిర్ణయం…

హైదరాబాద్: జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థలకు జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 709 కిలోమీటర్ల ప్రధాన రహదారుల నిర్వహణకు టెండర్లు పిలవనుంది. గుంతల పూడ్చివేత, కొత్త రోడ్లు, లేయర్ల నిర్మాణానికి వేర్వేరుగా టెండర్లు పిలిచింది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం కింద ఈ పనులు చేపట్టనున్నారు. ఐదేళ్లపాటు వర్కింగ్ ఏజెన్సీలకే పనుల బాధ్యత అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. రోడ్లు, ఫుట్‌పాత్‌లు తవ్వాలంటే ఆరు నెలల ముందుగానే సమాచారమిచ్చేలా నిబంధనను తీసుకువచ్చింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *