Breaking News
Home / National / జలదిగ్బంధానికి వారే కారణం….

జలదిగ్బంధానికి వారే కారణం….

బీహార్ : పాట్నాలో జరిగిన జలదిగ్బంధానికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీలే కారణమని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. జలదిగ్బంధానికి ఇప్పటికే తాము పాట్నా ప్రజలకు క్షమాపణలు చెప్పామని అన్నారు. భారీ వర్షాల కారణంగా జరిగిన జల దిగ్బంధానికి నితీశ్ కుమార్, సుశీల్ మోదీలే బాధ్యులని మండిపడ్డారు.

వీరితో పాటు అధికారులపై కూడా ఆయన మండిపడ్డారు. నిర్లక్ష్యానికి బాధ్యులపై, అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసినా, అధికారులు ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *