Breaking News
Home / States / మేడం.. నా పెళ్లి ఆపండి.. చదువుకుంటా.. షీ టీమ్‌కు బాలిక ఫోన్

మేడం.. నా పెళ్లి ఆపండి.. చదువుకుంటా.. షీ టీమ్‌కు బాలిక ఫోన్

తనకు ఇప్పుడే పెళ్లి వద్దని.. ఇంట్లో చెప్పినా వినకుండా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని.. ఓ బాలిక షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. తనకు ఉన్నత చదువులు చదువుకోవాలని ఉందని చెప్పి కంటతడిపెట్టింది. ఐసీడీఎస్ అధికారులు ఆమెను హైదరాబాద్‌లోని వసతి గృహానికి తరలించి.. చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణం జానంపేటలో ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 16 ఏళ్ల బాలిక ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. ఐతే తాను చదువుకుంటానని చెప్పినా వినకుండా పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు.

షాబాద్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధాన్ని కుదుర్చుకొని.. మే నెలలో నిశ్చితార్థం చేశారు. జులైై చివరి వారంలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఐతే తనకు ఇప్పుడే పెళ్లి వద్దని.. బంధువులు, స్నేహితులకు చెప్పి కంటతడిపెట్టింది బాధితురాలు. వారి సాయంతో షీ టీమ్‌ పోలీసులకు ఆమె ఫోన్‌ చేసింది.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *