Breaking News
Home / States / విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి…

విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి…

హైదరాబాద్‌: ఆకతాయిల వేధింపుల బారిన పడే మహిళలు, విద్యార్థినులు ఉపేక్షించవద్దని మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతి లక్రా అన్నారు. సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లి కస్తూర్బా మహిళా కళాశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాతి మాట్లాడారు. షీ టీం పోలీసులు ప్రత్యేకంగా వేధింపుల నిరోధానికి పనిచేస్తున్నారని.. ఫిర్యాదులు వస్తే తక్షణం స్పందించి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేసినప్పుడే సవాళ్లను ఎదుర్కోగలుగుతారన్నారు. ప్రతి కళాశాలలో వేధింపుల నిరోధ కమిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థినులు తమ మొబైల్‌ ఫోన్‌లలో హాక్‌ఐ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని స్వాతి సూచించారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *