Breaking News
Home / Film News / నాకు మళ్లీ చాన్స్ ఇవ్వండి…

నాకు మళ్లీ చాన్స్ ఇవ్వండి…

ఫిల్మ్ న్యూస్: గతంలో రామ్ చరణ్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మాణంలో ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ ఫ్యామిలీ ఎంటర్టయినర్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా 2014లో అక్టోబరు 1న రిలీజైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత బండ్ల గణేశ్ ట్విట్టర్ లో స్పందించారు. రామ్ చరణ్ ను లిటిల్ బాస్ గా పేర్కొంటూ, మళ్లీ మీతో ఓ సినిమా తీయాలనుందని, ఆ సినిమాను బ్లాక్ బస్టర్ గా ప్రజల ముందు ఉంచాలని భావిస్తున్నానని ట్వీట్ చేశారు. ‘లిటిల్ బాస్ నాకు త్వరగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ బహిరంగ విజ్ఞప్తి చేశారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *