Breaking News
Home / States / Andhra Pradesh / అలాంటి సంకేతం ఇవ్వడం శుభపరిణామం: రోజా

అలాంటి సంకేతం ఇవ్వడం శుభపరిణామం: రోజా

చిత్తూరు: దిశ అత్యాచార ఘటన బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. శుక్రవారం నగరిలో అంబేద్కర్‌ వర్థంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఇకపై అలాంటి నేరం చేసిన వారికి తగిన శిక్ష పడుతుందనే సంకేతం ఇవ్వడం శుభపరిణామమని రోజా అన్నారు.

‘దిశ’ ఘటన జరిగిన స్థలంలోనే కామాంధులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. దర్యాప్తు కోసం దిశ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి తీసుకువెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఎన్‌కౌంటర్ చేసిన ఘటన సంచలనం రేపింది. కాగా ఎన్‌కౌంటర్ తో ‘దిశ’కు ఆత్మశాంతి లభించిందని పలువురు మహిళా నేతలు వ్యాఖ్యానించారు. ‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *