Breaking News
Home / Film News / నిరాశలో గ్లామర్‌ నటి ఓవియా

నిరాశలో గ్లామర్‌ నటి ఓవియా

బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన పేరు ప్రతిష్టలను ఓవియా నిలుపుకోలేకపోతోంది. ‘కలవాని’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఓవియా తొలి సినిమాలో డీసెంట్‌గా నటించి అభిమానులను ఆకట్టుకుంది. అడపాదడపా చిత్రాల్లో నటించినా అనుకున్నంతగా రాణించలేకపోయింది. తరువాత గ్లామర్‌ పాత్రల్లో నటించడం ప్రారంభించింది. అయినా అవకాశాలు అంతంతమాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంతో బిగ్‌బాస్‌ టీవీ షోలో పాల్గొని ఒక్కసారిగా క్రేజ్‌ సంపాదించుకుంది. ఓవియా ఆర్మీ పేరుతో అమ్మడు హంగామా చేసి భారీగా అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత ఓవియాకు సినిమాల్లో భారీ అవకాశాలు వస్తాయని అభిమానులు ఆశించారు. ‘సిలుక్కు వారుపట్టి సింగం’లో ఐటెంసాంగ్‌లో కనిపించింది. ఆ తర్వాత ‘90 ఎంఎల్‌’, ‘గణేశా మీండుం సందిపోమ్‌’, ‘కాంచన 3’లో నటించింది. అయితే ఆమెకు ఆశించినంతగా పేరురాలేదు. ప్రస్తుతం సర్గుణ పాండ్యన్‌ దర్శకత్వంలో నటించిన ‘కలవాని 2’ వివాదంలో చిక్కుకుని అనుకున్న సమయంలో విడుదల కాలేదు. దీంతో ఆమె చాలా నిరాశకు గురైంది. ప్రస్తుతం కొత్త చిత్రాల అవకాశం కోసం ఎదురు చూస్తోంది. మరిన్ని మంచి అవకాశాలు రావాలని ఆమె అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

Check Also

ట్విట్టర్‌లో నవ్వులుపూయిస్తున్న మీమ్స్

Share this on WhatsAppవెబ్‌సిరీస్‌గా రిలీజైన సేక్రెడ్ గేమ్స్ రెండో సీజన్ కూడా సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఒకటో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *