ఫిల్మ్ న్యూస్: ప్రియుడితో బ్రేకప్ తర్వాత బోల్డ్‌గా కనిపించడానికి, బోల్డ్‌గా మాట్లాడడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తోంది గోవా బ్యూటీ ఇలియానా. తన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. అలాగే పలు కార్యక్రమాలకు హాజరై బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తోంది. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఇలియానా శృంగారం గురించి మాట్లాడింది.
`శృంగారం అనేది అద్భుతమైన అనుభవం. అది కేవలం ఆడ, మగ కలయిక మాత్రమే కాదు. శృంగారం అనేది పూర్తిగా మానసికం. ఇరువురి మధ్య ప్రేమ లేకపోతే శృంగారం అనేది యాంత్రికంగా మారుతుంది. అలాంటి శృంగారానికి అర్థమే లేదు. రెండు శరీరాలు కాదు.. రెండు ఆత్మల కలయికే శృంగారం` అని ఇలియానా చెప్పింది.