Breaking News
Home / National / బీజీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది

బీజీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది

పనాజి: గోవా కాంగ్రెస్ శాసనసభాపక్ష అధికారం బీజేపీలో విలీనం కావడంపట్ల ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడాంకర్ స్పందించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఇక దేవుడే కాపాడాలంటూ వ్యాఖ్యానించారు. ఒకే దేశం ఒకేపార్టీ విధానం కోసం బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజీపీ చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. బీజేపీకి ప్రజలే సరైన సమయంలో గుణపాఠం చేప్తారన్నారు.

గోవా శాసనసభలో కాంగ్రెస్‌కు 15 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 10 మంది పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షనేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్ రాజేశ్ పట్నేకర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు.. తమను బీజేపీలో విలీనం చేయాలంటూ లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే.

Check Also

మరోసారి వార్తల్లో నిత్యానంద

Share this on WhatsAppఅహ్మదాబాద్: నిత్యానంద నిర్వహణలో ఉన్న స్కూల్లో తమ ఇద్దరు కూతుళ్లను నిర్భంధించారని..వారిని విడిపించాలంటూ గుజరాత్ హైకోర్టులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *