Breaking News
Home / States / Andhra Pradesh / వైసీపీలో చేరిన గోకరాజు రంగరాజు…

వైసీపీలో చేరిన గోకరాజు రంగరాజు…

తాడేపల్లి: ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు రంగరాజు సోమవారం వైసీపీ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రంగరాజుతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు రామరాజు, నరసింహ రాజు కూడా పార్టీలో చేరారు. అనంతరం రంగరాజు మీడియాతో మాట్లాడుతూ… ‘ఈ పార్టీలో నేను కొత్తవాడిని అనుకోవడం లేదు. వైసీపీలో అందరూ మా వాళ్లే ఉన్నారు. పార్టీ పిలుపు మేరకు వైసీపీలో చేరాను’ అని తెలిపారు.

రామరాజు మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నాను. ఇవాళ వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో సొంతగూటికి చేరానని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాలు అమితంగా ఆకర్షించాయని, వైఎస్సార్‌ అంటే అమితమైన అభిమానం అని నరసింహరాజు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *