Breaking News
Home / States / Andhra Pradesh / 14న దుర్గమ్మకు బంగారు బోనం…

14న దుర్గమ్మకు బంగారు బోనం…

విజయవాడ: భాగ్యనగర మహాకాళి అమ్మవారి ఆలయం తరఫున బెజవాడ కనకదుర్గమ్మకు వచ్చేనెల 14న బంగారు బోనం, పట్టువస్త్రాలను సమర్పిస్తామని భాగ్యనగర శ్రీ మహాకాళి అమ్మవారి జాతర, బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు తెలిపారు. కమిటీ అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌యాదవ్‌, ఉపాధ్యక్షుడు జె.చంద్రమోహన్‌గౌడ్‌, మహాకాళి ఆలయ కమిటీ చైౖర్మన్‌ గాజుల అంజయ్య, కమిటీ సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మను కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవాలని, పాడి పంటలతో రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పదేళ్లుగా హైదరాబాద్‌ పాతబస్తీ నుంచి సామూహిక బోనా లు తీసుకొచ్చి బెజవాడ కనకదుర్గమ్మకు సమర్పిస్తున్నట్లు వివరించారు.

Check Also

చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ శిక్షణ పార్క్‌ ప్రారంభం…

Share this on WhatsAppనాగోలు: భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగేందుకు రోడ్డు భద్రత ముఖ్యభూమిక పోషిస్తుందని రాష్ట్ర అదనపు డీజీపీ జితేందర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *