Breaking News
Home / Lifestyle / Business / రూ.1.30 కోట్ల విలువైన బంగారు నగల పట్టివేత

రూ.1.30 కోట్ల విలువైన బంగారు నగల పట్టివేత

హైదరాబాద్: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ. 1.30 కోట్ల విలువగల బంగారు ఆభరణాలను జోగుళాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం, పుల్లూరు చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఎస్‌టీ-2 బృందం మంగళవారం పట్టుకున్నది. పాండురంగారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా నాలుగు కిలోల నగలు పట్టుబడ్డాయి. బెంగళూరులో జరిగిన జువెలరీ ఎగ్జిబిషన్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి తీసుకొని వస్తున్న బషీర్‌బాగ్‌లోని అభిషేక్‌ జువెలరీ యజమానిగా గుర్తించారు. వీటికి సంబంధించిన పత్రాలను వ్యాపారి అందజేశారని అలంపూర్‌ సీఐ రజితారెడ్డి తెలిపారు. వీటిని స్క్రీనింగ్ కమిటీకి పంపించామని చెప్పారు.

Check Also

ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

Share this on WhatsAppహైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన 3లక్షల 25 వేల మంది విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *